![]() |
![]() |

బిగ్ బాస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండేది సోమవారం జరిగే నామినేషన్ల ప్రక్రియ అనే చెప్పాలి. ఒక్కో కంటెస్టెంట్ చెప్పే కారణాలు, దానికి ప్రతి సమాధానాలు ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తాయి. హీటెడ్ సీన్స్ మధ్య జరిగే ఈ ఎపిసోడ్ ని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తారు అనేది నిజం.
"ఈ వారం ఒకరిని ఇంటి నుండి బయటకు పంపించడానికి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది" అని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కో కంటెస్టెంట్ మధ్య ఉత్కంఠ, టెన్షన్ మొదలయ్యాయి. అయితే నామినేషన్ల ప్రకియలో రేవంత్, కీర్తి భట్ ని నామినేట్ చేసాడు. "మొన్న జరిగిన వరెస్ట్ పర్ఫామర్ టాస్క్ లో మీరు నన్ను 'ఛీ థూ' అన్నారు. అది నాకు నచ్చలేదు" అని రేవంత్ అన్నాడు. దానికి సమాధానంగా కీర్తి భట్ మాట్లాడుతూ, " ఛీ థూ అనేది కూడా తప్పు వర్డ్ ఆ" అని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, " నువ్వు ఫేక్. నీదంతా యాక్టింగ్" అని అన్నాడు. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ గా రేవంత్, ఇనయాని నామినేట్ చేసాడు. రేవంత్ మాట్లాడుతుండగా మధ్యలో ఇనయా మట్లాడింది. "నేను చెబుతున్నాను. ఇనయా గారు మీరు మధ్యలో మాట్లాడకండి" అని రేవంత్ అరిచాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి, రేవంత్ ని నామినేట్ చేసాడు. నామినేషన్ కి గల కారణం చెబుతూ, "రేవంత్ కేపబులిటీ ఉన్న కంటెస్టెంట్. అతను అగ్రెసివ్. బెస్ట్ పర్ఫామర్. కాని మొన్న జరిగిన టాస్క్ లో మీరు తప్పు గా ఆడారు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా" అని ఆదిరెడ్డి చెప్పాడు. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ గా ఇనయాని చేసాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, " నాకు ఈ హౌస్ లో ఇనయా ఫేక్, ఫేకస్య, ఫేకోభ్యహ " అని అనిపించారు అని చెప్పగా, ఇనయా మాట్లాడుతూ, "నీకలా అనిపించింది. కాని నేను నా గేమ్ ఆడాను. నా గేమ్ నా ఇష్టం" అని సమాధానమిచ్చింది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా పోటాపోటీగా జరిగింది.
అయితే ఈ సారి నామినేషన్లో రాజ్, వసంతి, శ్రీహాన్ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరు కూడా నామినేషన్లో ఉన్నారు. కాగా వీరిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకు వెళతారో చూడాలి మరి. ఈ నామినేషన్లు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి అనడంలో సందేహమే లేదని చెప్పాలి.
![]() |
![]() |